కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య...
కుటుంబ కలహాలతో ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటు చోటుచేసుకుంది.
దిశ, బెల్లంపల్లి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటు చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకారం... బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన పందుల లక్ష్మి (32) , భర్త శేఖర్ తరచూ ఆమెతో గొడవ పడుతూ ఉండేది. దీంతో విసిగిపోయిన లక్ష్మి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో లక్ష్మినీ హుటా హుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ లక్ష్మి ఆస్పత్రిలోనే మృతి చెందడం జరిగింది. ఈ మేరకు తాళ్ల గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య...