ప్రజలకు ప్రభుత్వానికి వారధి ‘దిశ’ : మల్యాల సీఐ

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ దినపత్రిక

Update: 2024-12-29 06:47 GMT

దిశ, మల్యాల: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ దినపత్రిక పనిచేస్తుందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో దిశ దినపత్రిక ముందు స్థానంలో ఉందని మల్యాల సీఐ నీలం రవి అన్నారు. మల్యాల మండలం కు గాను ఆదివారం 2025 దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు క్రైమ్ వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారని,ప్రజా సమస్యలపై ఎక్కువగా వార్తలు రాస్తున్న దిశ మల్యాల మండల రిపోర్టర్ అట్ల నగేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దారం ఆది రెడ్డి, నల్లపు మల్లేశం, అనిల్ కుమార్, సంపత్ పాల్గొన్నారు.


Similar News