కౌశిక్ రెడ్డి Vs ప్రణవ్ బాబు.. ఇందిరమ్మ కమిటీల కోసం ఫైట్!

ఇందిరమ్మ కమిటీల వ్యవహారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు మధ్య వార్ నడుస్తోంది.

Update: 2024-10-18 02:32 GMT

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వ్యవహారం నియోజకవర్గంలో రాజకీయ వేడిని రాజేస్తోంది. గ్రామాల్లో కమిటీల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలపై ఇరువురు నాయకులు ఆయా గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 11న ఆర్ అండ్ బీ చీఫ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ గ్రామాలు, మున్సిపాలిటీలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోని 5 మండలాల్లో గల గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలు వేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబులు ఆయా గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులతో వేర్వేరుగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీల వివరాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేయగా, కాంగ్రెస్ నాయకులు ఏర్పాటుచేసిన ఇందిరమ్మ కమిటీల వివరాలను ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లకు అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు పార్టీల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీ చిచ్చు పెట్టే అవకాశం లేకపోలేదు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : ఇందిరమ్మ కమిటీల వ్యవహారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలపై ఇరువురు నాయకులు ఆయా గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి అధికారులకు అప్పగించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 11న ఆర్ అండ్ బీ చీఫ్ సెక్రటరీ జ్యోతిబుద్ధప్రకాష్ గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని 33 జీవో ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోని 5 మండలాల్లోని గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలు వేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబులు ఆయా గ్రామాల్లోని తమ పార్టీ కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి పార్టీ కార్యకర్తలతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపిక చేసిన ఇందిరమ్మ కమిటీల వివరాలను స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఇందిరమ్మ కమిటీల వివరాలను ఆయా మండలాల ఎంపీడీవోలకు, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లకు అందజేసినట్లు సమాచారం.

వేడెక్కిన రాజకీయాలు..

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల ఎంపిక నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గం నియోజకవర్గంలో వివాదానికి తెరలేపనుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నాయకులు తాము వేసిన కమిటీ చెల్లుబాటు అవుతుందని ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎంపికలో కూడా ఈ కమిటీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీ చిచ్చు పెట్టే అవకాశం ఉంది.

కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో?

పార్టీ మారిన అడిగే పూడి గాంధీతో కౌశిక్ రెడ్డి వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ పార్టీ పై దూకుడుగా వ్యవహరించే కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలో పంతం నెగ్గించుకుంటారా..? లేదా అధికార పార్టీలో ఉండి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రణవ్ బాబు పంతం నెగ్గుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హార్ట్ టాపిక్‌గా మారింది.

ఇందిరమ్మ కమిటీలో వీరికి చోటు..

గ్రామపంచాయతీల్లో పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. సర్పంచుల స్థానంలో పంచాయతీ ప్రత్యేక అధికారికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళా సభ్యులు, గ్రామ అభివృద్ధి పై అవగాహన కలిగిన ముగ్గురు గ్రామస్తులు(ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ) ఉండనున్నారు. పంచాయతీ సెక్రెటరీ ఇందిరమ్మ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం జారీచేసిన సర్కులర్ ప్రకారం గ్రామ సభలు పెట్టి జాబితాలు తయారు చేయాలని ఎక్కడా లేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ, తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామసభల ద్వారానే ప్రజల సమక్షంలో ఇందిరమ్మ కమిటీలను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News