దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం అగ్ని ప్రమాదం జరగడంతో కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నిలిచిపోయాయి. సర్వర్లు కాలిపోవడంతో పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.