మహిళామణుల అభ్యున్నతికి తోడ్పడును అందించడమే ప్రభుత్వ లక్ష్యం : పెద్దపల్లి ఎమ్మెల్యే

సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ లో ఇందిరా మహిళా శక్తి

Update: 2024-10-21 09:12 GMT

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను సోమవారం రోజున స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా గ్రామ సంఘాలు లాభాల బాటలో పయనిస్తాయని, తద్వారా ఆయా సంఘాల సభ్యులకు మేలు జరుగుతుందన్నారు.

ఐకేపీ ద్వారా విరివిగా మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిచ్చిందన్నారు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు. పేదల, మహిళల పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళల కోసం మరిన్ని పథకాలు తీసుకురావడానికి ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, పట్టణ కౌన్సిలర్లు,ఐకెపి బిపిఎం రజని, ఏపీఎం లు శ్రీనివాస్, గీత,మినుపల ప్రకాష్ రావు,సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్,చిలుక సతీష్, అమిరిశెట్టి తిరుపతి మండల సమైక్యా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News