సీతంపేటలో ఎస్సీ, ఎస్టీ కేసు పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు విచారణ..

మండలంలోని సీతంపేట గ్రామంలో ఎస్సీ, ఎస్టీ పిటీషన్ పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు ఆదివారం విచారణ చేశారు.

Update: 2023-07-30 14:51 GMT

దిశ, ముత్తారం : మండలంలోని సీతంపేట గ్రామంలో ఎస్సీ, ఎస్టీ పిటీషన్ పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు ఆదివారం విచారణ చేశారు. గ్రామానికి చెందిన అన్నం రాజమల్లు అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ పులిపాక నగేష్ ను కులం పేరుతో దూషించారని సర్పంచ్ ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ఈరోజు ఏసీపీ విచారణ గ్రామస్తుల సమక్షంలో చేశారు. ఏసీపీ వెంట మంథని సీఐ గడిగొప్పుల సతీష్, ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు.


Similar News