కొప్పులకు అధికారం పై ఉన్న ఆశ అభివృద్ధి పై లేదు.. నక్కవిజయ్ కుమార్
గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన గడపగడపకు గజరాజు కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి నక్కవిజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దిశ, గొల్లపల్లి : గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన గడపగడపకు గజరాజు కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి నక్కవిజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని వాపోయారు. అదేవిధంగా గ్రామమంతటిలో ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేని అసమర్ధుడు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఉండడానికి సరియైన ఇల్లు లేని వారు శిధిలావస్తలో ఎంతోమంది జీవనం కొనసాగిస్తున్నారని ఆశీర్వాద సభలకు పెట్టే డబ్బులు వారి నివాస స్థలాల పై పెడితే బాగుండేది అని ఎద్దేవ చేశారనీ, మంత్రి స్వయాన శంకుస్థాపన చేసిన వంతెన కూడా పూర్తి చేయలేక ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉండడం, ఒక్కరంటే ఒక్కరికి మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు.
సంక్షేమం అంటే విద్యా వైద్యం, నివాసం, అనే అంశాల పై కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాడు మంత్రి మాత్రం విలాసవంతమైన ఇండ్లలో ఉంటున్నారనీ, విద్యా వైద్యం కనీస ఇల్లు అనే రాజ్యాంగబద్ధమైన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఆశీర్వాద సభలో అంటూ వీటన్నిటిని గాలికి వదిలేసి ఏడవ సారి నన్ను గెలిపించండి అని మంత్రి తిరగడం ఆశాస్పదంగా ఉందన్నారు. ఒక కార్మిక కుటుంబంలో నుంచి వచ్చి మంత్రిగా కొనసాగుతూ నియోజకవర్గంలో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో చెప్పాలన్నారు. బీఆర్.అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కు నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ కళాశాలల పరిస్థితి వైద్య పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వాపోయారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల అధ్యక్షులు కల్లపల్లి తిరుపతి, దట్నూరు గ్రామ అధ్యక్షులు మీసాల పోసెట్టి, గ్రామ ఉపాధ్యక్షులు మీసాల హనుమాన్లు, మీసాల శేఖర్, కొల్లూరు స్వామి, మీసాల అంజయ్య, మీసాల అనిల్, బేక్కం రజిని, బెక్కం రాజేశం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.