గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

జమ్మికుంటలో అస్వస్థతకు గురైన ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గుండెపోటు కారణంగానే ఆమె మరణించి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Update: 2024-10-16 03:27 GMT

దిశ, వెబ్ డెస్క్: గుండెపోటుకు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. పిల్లల నుంచి పండు ముసలి వరకూ ఎవరూ ఇందుకు అతీతులు కారు. మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తుందో ఎవరికీ తెలియదు. గుండెపోటు(Heart Attack)తో ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. రాజు - జమున దంపతుల కుమార్తె ఉక్కులు (5) మంగళవారం ఉదయం అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు.

హన్మకొండలో చిన్నారిని పరిశీలించిన వైద్యులు.. ఆమె మరణించినట్లు చెప్పారు. గుండెపోటుకు గురై ఉంటుందని పేర్కొన్నారు. బహుశా చిన్నారికి పుట్టినప్పటి నుంచే గుండె సమస్య ఉండి ఉండవచ్చని, తల్లిదండ్రులు ఆ విషయాన్ని గుర్తించకపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న కూతురు ఇలా మృత్యుఒడికి చేరడంతో.. ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 


Similar News