ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం
వికారాబాద్ లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సందర్భంలో విషయం తెలుసుకున్న మాస్ సంస్థ ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.
దిశ, జమ్మికుంట : వికారాబాద్ లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సందర్భంలో విషయం తెలుసుకున్న మాస్ సంస్థ ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి రాజయ్య-సంపూర్ణ దంపతుల కుమారుడు ఆకునూరి సామెల్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సామెల్ కుటుంబం తమ కుమారుడి చదువు కొనసాగించలేడనే విషయం తెలుసుకున్న మహా ఆది సేవ సంస్థ (మాస్) ప్రతినిధులు గురువారం సామెల్ పుస్తకాలు, హాస్టల్ ఖర్చుల కోసం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మోలుగురి సదయ్య, వేల్పుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.