జగిత్యాల ఎంసీహెచ్ లో ఎక్క్స్పైరీ మెడిసిన్

జగిత్యాల ఎంసీహెచ్ లో ఎక్స్పైరీ మెడిసిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-11 15:50 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల ఎంసీహెచ్ లో ఎక్స్పైరీ మెడిసిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల కిందనే ఎక్స్పైరీ ముగిసిన మెడిసిన్ ను వెంటనే డిస్పోస్ చేయాల్సి ఉండగా అలానే ఉంచారు. బుధవారం అస్వస్థతకు గురైన సారంగాపూర్ కేజీబీవీ విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ జెడ్పీ చైర్​పర్సన్ దావ వసంతతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పిల్లలకు చికిత్స అందిస్తున్న గదిలో ర్యాక్ లో ఎక్స్పైరీ అయిన మెడిసిన్ గుర్తించారు.

    ఈ విషయమై సిబ్బంది నిలదీశారు. ఎక్స్పైరీ అయిన మెడిసిన్ విద్యార్థులకు ఇస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ను అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎంఓ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ను డిస్పోస్ చేయడానికి సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఆస్పత్రికి వచ్చిన వారు అవే మందులు వాడుతున్నట్లుగా భావించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం ఎంసీహెచ్ లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపిన ఆర్ఎంఓ సంబంధిత నర్సింగ్ సిబ్బందితో లిఖిత పూర్వక సంజాయిషీ తీసుకున్నట్లు పేర్కొన్నారు.


Similar News