యాసంగి పంటకు నీటి విడుదలకు ఏర్పాట్లు.. ఈఈ బాల రామయ్య
యాసంగి పంటకు నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంథని ఇరిగేషన్ ఈఈ బాల రామయ్య తెలిపారు.
దిశ, మంథని : యాసంగి పంటకు నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంథని ఇరిగేషన్ ఈఈ బాల రామయ్య తెలిపారు. మంథని ఇరిగేషన్ కార్యాలయంలో డీఈ, ఏఈ, జెఈ, సంబంధిత అధికారులతో యాసంగి పంటకు సంబంధించిన నీటి విడుదల గురించి టెలెంట్ ప్రాంతాలకు అందించాలని ఉద్దేశ్యంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారంలోపు నీటిని పంట పోలాలకు అందిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. నీటి విడుదలకు సంబంధించిన సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో డీఈ, ఏఈ, జెఈ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.