రైతులను ఇబ్బంది పెట్టొద్దు
రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, తిమ్మాపూర్ : రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండలం రేణి కుంట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం లో కొనుగోళ్లు జరుపుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలన్నారు. కొనుగోళ్ల విషయంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.