నిర్వాసితులకు ఎల్లంపల్లి పరిహారం పంపిణీ

గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో

Update: 2024-11-07 12:04 GMT

దిశ, వెల్గటూర్ : గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిర్వాసితులైన చెగ్యాం గ్రామస్తుల పరిహారాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.వెల్గటూర్ మండలంలోని చెగ్యాం ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినరూ. 18 కోట్ల నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను గురువారం గ్రామంలోని స్థానిక రైతు వేదిక వద్ద లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపి వంశీ తో కలిసి పంపిణీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద విలువైన భూములు ఇల్లు సర్వస్వం కోల్పోయి ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు.

చెగ్యాం గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించడం లో మా తాత కీ.శే కాక వెంకట స్వామి పాత్ర ఎంతో ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకు న్నామని విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీ స్పష్టం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ముంపు బాధితులు పరిహారం కోసం చేసిన ప్రతి నిరసనలో, ధర్నాలో వారి వెంట నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెండింగ్ పరిహారం సమస్య కొలిక్కి వచ్చిందన్నారు. అంతకు ముందు ఎంపీ తో కలిసి ముక్కట్రావుపేట్, ముత్తు నూర్, చెగ్యాం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి వారు ప్రారంభించారు. అనంతరం ఎల్లంపల్లి జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మంజూరైన చేప పిల్లలను విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి పోశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక, గోళ్ళ తిరుపతి మద్దుల గోపాల్ రెడ్డి శైలేందర్ రెడ్డి ఎంపీటీసీ రంగు తిరుపతి ఆను మాల మంజుల రామ్మోహన్ రావు కూస లక్ష్మణ్ ఆర్డీవో మధు సూధన్ గౌడ్, ఎమ్మార్వో శేఖర్ ఎం పీవో జక్కుల శ్రీనివాస్ ఆర్ ఐ రాజేశ్వరి తదితరులు ఉన్నారు.


Similar News