నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి : వేములవాడ ఎమ్మెల్యే
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటు
దిశ, రుద్రంగి : నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. గురువారం రుద్రంగి మండల కేంద్రంలో రూ. 3 లక్షల 8 వేల విలువ గల 8 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి LOC లు కూడా ప్రభుత్వం తరపున మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.