దిశ ఎఫెక్ట్...రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన విజయోత్సవాలకు రాజన్న ఆలయం దూరం అంటూ దిశ పత్రికలో వచ్చిన కథనానికి ఆలయ అధికారులు స్పందించారు.
దిశ, వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన విజయోత్సవాలకు రాజన్న ఆలయం దూరం అంటూ దిశ పత్రికలో వచ్చిన కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. కథనం వెలువడిన వెంటనే తేరుకున్న అధికారులు హుటాహుటిన ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఈ క్రమంలో రాష్ర్ట ప్రజల శ్రేయస్సు కోరుతూ ఆలయంలో మహా రుద్ర యాగం, చండీ హోమం, కోడె పూజ, రుద్రాభిషేకం నిర్వహించినట్లు పేర్కొన్నారు.