డేంజర్.. ప్రధాన రహదారి పక్కన తెగిపడ్డ విద్యుత్ తీగలు..!

Update: 2024-08-10 04:44 GMT

దిశ, చందుర్తిః గాలివానలకు విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, కరెంట్ తీగలు తెగిపడటం లాంటివి చూస్తూనే ఉన్నాం. మండలం లోని మల్యాల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుండావిద్యుత్ తీగలు చెట్టుకొమ్మలకు తగిలి ఒక్కొక్కటిగా తెగిపడుతున్నాయి. పక్కనే ఉన్న మాల సంఘ భవనంలో మాల కులస్తులు సంఘం ఏర్పాటు చేసుకున్న సమయంలోనే విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయని వాటిని చూడకుండా ఎవరైనా అటువైపు వెళితే వారు విద్యుత్ ఘాతుకానికి బలి కావాల్సిందేనా అని స్థానికులు సిబ్బందిపై ఆగ్రహం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోరా అని అంటున్నారు.గతంలో లింగంపేట గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ స్తంభాలు కూలి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఇంత జరుగుతున్నా సెస్ ఆధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం సరికాదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

Tags:    

Similar News