MLA : రామగుండం సుందరీకరణ కోసం సహకరించండి

రామగుండం అభివృద్ధికి నగర ప్రజలు,రాజకీయ నాయకులు, మేధావులు వ్యాపారస్తులు సహకరించాలని, చేయి చేయి కలుపుకుని ముందుకు పోదాంమని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.

Update: 2024-10-18 08:09 GMT

దిశ, గోదావరిఖని : రామగుండం అభివృద్ధికి నగర ప్రజలు,రాజకీయ నాయకులు, మేధావులు వ్యాపారస్తులు సహకరించాలని, చేయి చేయి కలుపుకుని ముందుకు పోదాంమని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ రూడా గా ఏర్పడడానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రామగుండం ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం రూడా ఏర్పడడం వల్ల రామగుండం మరింత అభివృద్ధి చెందుతుందని చుట్టూ ఉన్న గ్రామాలు రూడా పరిధిలోకి వస్తాయని, రామగుండం కార్పొరేషన్ ప్రస్తుతం 50 డివిజన్లో నుంచి 60 డివిజన్లు చేసేందుకు ప్రయత్నాలు సైతం కొనసాగుతున్నాయని అన్నారు. గత పాలకుల వల్ల ఈ ప్రాంతం బొందల గడ్డగా మారిందని, రోడ్లు వెడల్పు లేక, లైటింగ్ ఏర్పాటు చేయకుండా వినియోగదారులు వాహనదారులు అనేక ఇబ్బందులకు గురైన సంఘటనలు ఉన్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం అభివృద్ధి దిశగా మారుతుంటే కొందరు దుష్ట శక్తులు ఓర్వలేక వ్యాపారస్తులను రెచ్చగొట్టి పోరాటాలు చేపిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అంటున్నారు.

గత పాలకులుతో రామగుండం బొద్దుల గడ్డగ మారింది

గత పాలకుల అసమర్థత వల్ల రామగుండం అభివృద్ధి చెందాక ఈ ప్రాంతమంతా బొందల గడ్డ గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుందని, రామగుండం ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు, ప్రాణనష్టం ఏర్పడిందని రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేక అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

లక్ష్మీ నగర్ కు మహర్దశ..

లక్ష్మీ నగర్ సుందరికరణ కోసం రూ. 29 కోట్ల 50 లక్షలు వెచ్చించామని రోడ్లు వెడల్పు, కొత్త రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,కొత్త కరెంట్ పోల్స్, లైటింగ్, సీసీ కెమెరాలతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. రానున్న రోజులలో లక్ష్మీ నగర్ కు మహర్దశతో సుందరికారంగా ఏర్పడుతుందని పేర్కొన్నారు. రామగుండం అభివృద్ధికి వ్యాపారస్తులు సహకరించాలని, రామగుండం కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని ఈ ప్రాంత వాసులు అందరూ సహకరించాలని వేడుకున్నారు.

నూతన మున్సిపల్ కాంప్లెక్స్ కు మోక్షం

రామగుండం నూతన మున్సిపల్ కాంప్లెక్స్ నగరం నడిబొడ్డున రూ. 12 కోట్లతో 70 విశాలమైన గదులను పైన, కింద ఏర్పాటు చేశామని, గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటూ మందుబాబులకు అడ్డగా మారిందని అన్నారు. స్థానిక అశోక్ నగర్ లోని మొబైల్ షాపులు, హోటల్స్, కూలర్ షాపులు రోడ్డు వెడల్పులో తొలగించడం జరుగుతుందని, వారి భవిష్యత్తు కోసం వ్యాపారస్తులకు నూతన మున్సిపల్ కాంప్లెక్స్ కు తరలించి వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరారు.

ప్రధాన చౌరస్తా నుండి లక్ష్మీ నగర్ వరకు రోడ్డు వెడల్పు

గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తా నుండి సింగరేణి కోటర్సు , లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, అశోక్ నగర్ , ప్లాట్ ఫారం పై బిజినెస్ చేసేవారు కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు రామగుండం అభివృద్ధికి తోడ్పడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కోరారు.


Similar News