ఓట్లు, సీట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ : బండి సంజయ్

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం కోసమే పోటీ

Update: 2023-11-15 16:36 GMT

దిశ,కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. సాలు గంగుల.... ఇక సెలవు గంగుల... బై బై గంగుల... అంటూ యువకులతో కలిసి నినదించారు. ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తరువాత కరీంనగర్ లోని రాంనగర్ లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడు.. నేను ధర్మాన్ని, కరీంనగర్ ప్రజలను నమ్ముకున్న. ప్రజలే అంతిమ నిర్ణేతలు. తగిన తీర్పు ఇవ్వబోతున్నారు’’అని చెప్పారు. ఓట్ల కోసం, సీట్ల కోం పేర్లు, కులగోత్రాలు మార్చుకునే నీచమైన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్సేనని విమర్శించారు. ‘‘రాహుల్ గాంధీ అసలు రౌల్ విన్సీ... రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ గాంధీ గా మారారు. కల్వకుంట్ల అజయ్ రావు... కల్వకుంట్ల తారక రామారావు గా మారారు. ఇప్పుడు కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఎంఐఎం ఓట్ల కోసం దారుస్సలాం పోయి టోపీ పెట్టుకుని కరీంనగర్ కమృద్దీన్ గా మారారు’’ అంటూ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News