ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించాలి: జిల్లా కలెక్టర్ రవి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ....Collector meeting with officials

Update: 2022-11-26 15:24 GMT
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించాలి: జిల్లా కలెక్టర్ రవి
  • whatsapp icon

దిశ, జగిత్యాల కలెక్టరేట్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రవి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని జనరల్ ఆస్పత్రి వైద్య కళాశాలకు అనుబంధంగా మారడంతో ఓపీ సంఖ్య 400 నుండి 800 కు పెరిగిందని, 460 కి పైగా డెలివరీలు అవుతున్నాయని తెలిపారు. డ్రగ్ స్టోర్, సిటీ స్కాన్ ఆస్పత్రిలో 50 పడగల అత్యవసర బ్లాకు, రేడియాలజీ డిపార్ట్మెంట్లు వచ్చాయని అన్నారు. ఈఎన్ టీ, రేడియాలజీ డిపార్ట్మెంట్లో వైద్య కొరత ఉండడంతో అవసరమైన వైద్యులను వైద్య విధాన పరిషత్ నుండి డిప్యూటేషన్ పై తెచ్చుకోవాలని, ఎంసీహెచ్ లోని ఆపరేషన్ థియేటర్ కు ఆక్సిజన్ పైప్లైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు.

Tags:    

Similar News