మైనార్టీలకు కాంగ్రెస్​ పెద్ద పీట

మైనార్టీలకు కాంగ్రెస్​ పెద్ద పీట వేస్తుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2025-03-23 15:08 GMT
మైనార్టీలకు కాంగ్రెస్​ పెద్ద పీట
  • whatsapp icon

దిశ,మంథని : మైనార్టీలకు కాంగ్రెస్​ పెద్ద పీట వేస్తుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని పురపాలక సంఘం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. రంజాన్ వేడుకల సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సుఖంగా ఉండాలని ముస్లింలు చేస్తున్న ప్రార్ధనలతోనే సెక్యులర్ భావాలతో నడుస్తున్నామన్నారు.

    ఈ సంవత్సరం తమ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మైనార్టీలకు రూ.3 వేల కోట్ల బడ్జెట్​ కేటాయించినట్టు తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చదువుకునే యువతకి స్వయం ఉపాధి పథకాలతో పాటు నాలుగు పర్సంటేజీ రిజర్వేషన్లను కొనసాగిస్తున్నామన్నారు. అందులో భాగంగానే గ్రూప్1 పరీక్షలతో పాటు గ్రూప్ 4 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఫంక్షన్ హాల్, మ్యారేజీ హాల్, ఇండ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈద్గా అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామన్నారు. 


Similar News