నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి

నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

Update: 2024-11-09 10:55 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ ఈనెల 30వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

    మళ్లీ గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని 37 మంది రైస్ మిల్లర్లు పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా ఇవ్వని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, మేనేజర్ రజిత, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News