ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా నగరాభివృద్ధి : మంత్రి గంగుల
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా నగరాభివృద్ధిపై దృష్టి సారించినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
దిశ, కరీంనగర్ : ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా నగరాభివృద్ధిపై దృష్టి సారించినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో జంక్షన్ల అభివృద్ధిపై నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ 2వ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. కరీంనగర్ ను పరిశుభ్రమైన, ఆహ్లాద, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన జంక్షన్ ట్రయల్ రన్ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు