Bandi Sanjay Kumar : కల్లు రుచి చూసిన బండి సంజయ్

మండలం ప్రజాహిత యాత్రలో భాగంగా లింగాపుర్ గ్రామంలో

Update: 2024-03-06 13:54 GMT

దిశ,శంకరపట్నం: మండలం ప్రజాహిత యాత్రలో భాగంగా లింగాపుర్ గ్రామంలో రేఖ పట్టి కల్లు తాగిన బండి సంజయ్. అనంతరం కల్లు గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కల్లు గీత కార్మికుడి తో ముచ్చటిస్తూ.. ఈ గ్రామంలో ఎంతమంది కల్లు గీత కార్మికులు ఉన్నారు.. ఎంత కల్లు అవుతుంది? ఆదాయం ఎంత ? వగైరా అంశాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు.

సరదాగా గౌడన్న మోపు వేసుకొని సంజయ్

కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న సంజయ్. ఆరోగ్య నిపుణులు సైతం ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేసిన సంజయ్ వైన్స్, బార్లు పెట్టీ కేసీఆర్ గౌడన్నల పొట్ట కొట్టిండు.. 73 ఏళ్ల వయసు పై బడిన గౌడన్నలు ఇప్పటికీ కల్లు గిస్తున్నారు.. తాడిచెట్టు ఉన్న దగ్గర షెడ్లు వేయిస్తన్నానీ గౌడన్న కు సంజయ్ తెలిపాడు.

Tags:    

Similar News