పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Update: 2023-03-18 09:40 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా టీఎస్పీఎస్పీ కమిటీ సభ్యులను నియమించి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని గవర్నర్ తనకున్న విచక్షణ అధికారులు ఉపయోగించి తక్షణమే టీఎస్పీఎస్పీ చైర్మన్, సెక్రటరీలను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తమకున్న చిత్త శుద్ధి నిరూపించుకోవాలంటే ప్రభుత్వ జేబు సంస్థ అయిన సిట్ ద్వారా కాకుండా కేసును సీబీఐకి అప్పగించి నిజాయితీ నిరూపించుకొవాలని హితవు పలికారు. టీఎస్పీఎస్పీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు అందరికీ నిరుద్యోగ భృతి కల్పించి గ్రూప్ వన్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తో పాటు ఉచిత భోజన వసతి కల్పించేలా జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు చేయకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.

లిక్కర్ స్కాంలో విచారణకు ఎమ్మెల్సీ కవిత ను పిలిస్తే మంత్రివర్గం అంతా ఢిల్లీ వెళ్లారని కానీ, ఇక్కడి నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చినపుడు విచారణకు పిలవకపోతు మరేంచేస్తారని.. ఎమ్మెల్సీ కవిత సోనియా గాంధీ కంటే పెద్ద లీడరా అని అన్నారు.

Tags:    

Similar News