జేఈఈ (మొయిన్స్) ఫలితాల్లో 'అల్ఫోర్స్'కు ర్యాంకుల పంట
జేఈఈ (మొయిన్స్)2023 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
దిశ, కరీంనగర్ టౌన్ : జేఈఈ (మొయిన్స్)2023 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. పి.రాకేశ్ 12వ ర్యాంకుతో గతంలో సాధించిన 18వ ర్యాంకును అధిగమించి అత్యున్నత స్థానంలో నిలిచాడు. బి.మారుతి 228 వ ర్యాంకు, ఏ.ఇషాంత్ రెడ్డి 250 ర్యాంకు, యమ్.అభిరామ్ 448 వ ర్యాంకు, అర్.సుహాసిత రెడ్డి 480, జి.సాత్విక్ 511, పి.హర్షవర్ధన్ 520, కె.రాహుల్ 554, యమ్.అరుణ్ 624, ఏ.శివసాయిచరణ్ 634, వై. శివమణి 680, డి.వివేకవర్థన్ 748, బి.రాజ్కుమార్ 805, బి.శ్రీనివాస్ 939 ర్యాంకు సాధించాడు.
అదేవిధంగా ఎం.అభిరామ్ ఫిజిక్స్ లో 100 కు 100 మార్కులు సాధించి 100 పర్సంటైల్ సాధించడం అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం సాధించిందని చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. 1000 లోపు 14 ర్యాంకులు, 5000 లోపు 40 ర్యాంకులు, 10000 లోపు 70 ర్యాంకులు సాధించడం గర్వ కారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా విద్యార్థులు ఐఐటీ (అడ్వాన్స్) పరీక్షకు అర్హత సాధించడం అల్ఫోర్స్ మరో సంచలనం అని అన్నారు. ఐఐటీ (అడ్వాన్స్) జూన్ 4న జరిగే పరీక్షకు ఎంపికైన విద్యార్థులకు భారతదేశంలో ఉన్న అత్యుత్తమ అధ్యాపక బృందంచే ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు.
పటిష్ట ప్రణాలికతో విద్యా భోధన మరియు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషలు చేసిన కృషి వల్లే అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని తెలియజేశారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్స్) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి, ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఐఐటీ మరియు నీట్ పోటీ పరీక్షల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఐఐటీ - జేఈఈ (మొయిన్స్) 2023 ఫలితాల్లో జాతీయ స్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ చిన్నారులను, వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ఘన విజయానికి తోడ్పడిన తమ అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియశారు.