సోనియా గాంధీకి పాలరాతి గుడి నిర్మించిన కాంగ్రెస్ అభిమాని..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని ఏఐసీసీ మాజీ

Update: 2024-06-03 11:25 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ నెవూరి మమత వెంకటరెడ్డి సోనియాకు పాలరాతి గుడిని నిర్మించారు. పాలరాతి గుడిని నిర్మించడంతో పాటు అందులో సోనియా చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులతో కలిసి గుడిని ఆవిష్కరించారు. పది సంవత్సరాల క్రితం రాష్ట్ర అవతరణ సందర్భంగా గుడి నిర్మాణానికి అప్పటి సర్పంచ్ మమత భూమి పూజ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో గుడి నిర్మాణం ఆగిపోయిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుడి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి తెలిపారు.


Similar News