కరీంనగర్-వరంగల్ హైవే పనులెంత వరకు వచ్చాయ్.. విస్తరణ పనులపై బండి సంజయ్ సమీక్ష

కరీంనగర్-వరంగల్(ఎన్.హెచ్ 563) జాతీయ రహదారి పనుల విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరా తీశారు.

Update: 2023-09-16 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్-వరంగల్(ఎన్.హెచ్ 563) జాతీయ రహదారి పనుల విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరా తీశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఎన్.హెచ్ విభాగం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. కరీంనగర్-వరంగల్(ఎన్.హెచ్ 563) జాతీయ రహదారి పనుల విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంపైనా ఆరా తీశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది జూలై 8న శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన బండి సంజయ్ నిర్ణీత వ్యవధిలోనే విస్తరణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఇందు కోసం అవసరమైన సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జాతీయ రహదారుల అథారిటీ పీడీ మాధవి, మోహనాచారి, కమలేశ్, త్రిపాఠి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

Tags:    

Similar News