PC Ghosh Commission: కాళేశ్వరం రుణాలు ఫిక్స్డ్ డిపాజిట్.. పీసీ ఘోష్ విచారణలో షాకింగ్ అంశాలు

పీసీ ఘోష్ కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది.

Update: 2024-09-25 10:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగిస్తోంది. బుధవారం విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణి భూషణ్ శర్మను కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను ఆరా తీశారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు, సిబ్బంది జీతాలు ఎవరు చెల్లించారు వంటి అంశాలపై ప్రశ్నించారు. అయితే కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా వాటిని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని వాటి ద్వారా వచ్చిన డబ్బులను కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడినట్లు వెంకట అప్పారావు కమిషన్ తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రుణాల ద్వారా వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారని అధికారులను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ లో కాంట్రాక్ట్, డిప్యూటేషన్ పై వచ్చే వారు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లుగా చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా? లోన్లు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి చీఫ్ సెక్రటరీ అదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం అనంతరమే లోన్లు తీసుకున్నట్లు వివరించారు. రుణాలు తీసుకున్నాక ఎవైనా అసెట్స్ వచ్చాయా అని పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నకు అధికారులు బదులిస్తూ.. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎలాంటి ఆదాయం, అసెంట్స్ లేదని బదులిచ్చారు. 


Similar News