Uttam: కాళేశ్వరం అన్ని పంపులు నడుస్తే కరెంట్ బిల్లు రూ.13 వేల కోట్లు! మంత్రి ఉత్తమ్ ఎన్‌డీఎస్ఏ‌తో భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-07-20 13:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని కేసీఆర్ కక్కుర్తి పడ్డారని విమర్శించారు. శనివారం ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సమావేశం జరిగింది. మీటింగ్ పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని గుర్తుచేశారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ. 38 లక్షల కోట్ల అంచనాతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని చెప్పారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కుంగిపోయిందని, కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మరోవైపు తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు రీడిజైన్ చేశారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదన్నారు. ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారని, ఏడాదికి సగటున కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని స్పష్టం చేశారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒక లక్ష 24 కోట్లు ప్రాజెక్టు ఖర్చు అయింది, పూర్తి అయితే దాదాపు లక్షన్నర కోట్లు పెరుగుతుందన్నారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే కరెంటు బిల్లు రూ.13 వేల కోట్లు అవుతుందని అన్నారు. లక్షకోట్ల పెట్టుబడిపై పదివేల కోట్ల వడ్డీ అని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం వల్ల అమూల్యమైన ప్రజా ధనం వృధా అయిందని ఆరోపించారు. అయితే ప్రాజెక్టుపై మరోసారి ఇంజినీర్ల స్థాయలో ఈ సోమవారం చర్చలు జరుగనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..