KA Paul Strong Warning To CM KCR :నన్ను ఫినిష్ చేయలేవు కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లలో, చెవుల్లో, చేతుల్లో, మనసులో అవినీతి ఉందని, ఆయన అవినీతి ఆకాశాన్ని అంటిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లలో, చెవుల్లో, చేతుల్లో, మనసులో అవినీతి ఉందని, ఆయన అవినీతి ఆకాశాన్ని అంటిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. వారు చేస్తున్న అవినీతిని అక్రమాలను కవర్ చేయడానికే మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయడంలేదన్నారు. టీఎస్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదని, వారం రోజుల్లో కమిషన్ చైర్మన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదాశివపేట పోలీసులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేశారు. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కేఏ పాల్ కోరారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌ను కలవడానికి వెళితే తనను అడ్డుకున్నారని, అవినీతి మీద ప్రశ్నిస్తున్న అని భయపడి తనను సీఎం కలవలేదన్నారు. ఎవరినైన ఫినిష్ చేసేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని, నన్ను ఫినిష్ చేయలేవు కేసీఆర్.. నువ్వు ఫినిష్ అవుతున్నావు.. అని మండిపడ్డారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ తీయించాడని, ఆయన స్నేహితుడైన కిషన్ రెడ్డిని కేసీఆర్ బీజేపీ అధ్యక్షునిగా నియమించుకున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బెస్ట్ ఫ్రెండ్ కిషన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఒక ఛానల్లో.. మా ప్రధాన ప్రతిపక్షం కేఏపాల్ అని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్నంత అవినీతి తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేదన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు నన్ను కలవడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే కేసీఆర్ అవినీతి బయట పెడుతా అన్నందుకే కలవడం లేదన్నారు.