కాళేశ్వరం విచారణలో ట్విస్ట్.. ప్రాణహిత అంశాన్ని తెరపైకి తెచ్చిన పీసీ ఘోష్ కమిషన్

కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ మిషన్ విచారణ కొనసాగుతంది.

Update: 2024-06-14 09:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ మిషన్ విచారణ కొనసాగుతంది. శుక్రవారం ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం విభాగాల ఇంజినీర్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆరా తీసింది. ఆ నివేదికను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టారన్న సంగతి కూపీ లాగే ప్రయత్నం చేసింది. అలాగే గోదావరిలో నీరున్నా ప్రాణహిత నుంచి ఎత్తిపోయడంపై కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా పీసీ ఘోష్ కమిషన్ ఇంజినీర్లకు సంబంధించి చేపట్టిన విచారణ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అధికారుల విచారణ పూర్తయితే బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన ప్రజాప్రతినిధులను విచారించబోతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వగా రేపటితో ఆ గడువు ముగియనున్నది. రేపటిలోగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News