తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న.. పొంగులేటి, జూపల్లి భేటీ

Jupalli left for Ponguleti Atmiya Sabha with his followers

Update: 2023-04-09 06:44 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు అనూహ్యంగా ఓటమిపాలు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి అధికార టిఆర్ఎస్‌లో చేరడంతో కృష్ణారావు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. అధికార పార్టీలోనే ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మద్దతుదారులను పోటీ చేయించి మెజారిటీ స్థానాలలో గెలుపొందించడంలో ప్రధాన భూమిక పోషించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ తనకు తప్పకుండా ఇస్తుందన్న ఆశతో ఉన్నప్పటికిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇస్తామని ప్రకటించడం తో జూపల్లి అధికార పార్టీ టికెట్ వస్తుందన్న ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తూ వచ్చారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చారు. గత రెండు మూడు రోజుల నుంచి మరో అడుగు ముందుకు వేసి సాగునీటి వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల వేలాది ఎకరాల్లో పంట చేలు ఎండిపోతున్నాయని పాలకులపై విరుచుకుపడ్డారు.

తన అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం అధిష్టానం పై తిరుగు బావుటాను ఎగరవేశారు. గత ఐదు నెలల క్రితం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది ఖమ్మం కు చెందిన ముఖ్య నేతలు భేటీ అయ్యారు.. అప్పట్లోనే వారి భేటీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనియాంశమయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అన్న ఆలోచనలతో ఇరువురు నేతలు వచ్చినట్లు వారి వారి అనుచరులు భావిస్తున్నారు.. భారతీయ జనతా పార్టీలో చేరడమా..!? కాంగ్రెస్‌లో చేరడమా అనే అంశంపై అనుచరుల నుండి అభిప్రాయ సేకరణలు చేసినట్లు తెలుస్తోంది. ఇరువురి నేతలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

జూపల్లి కాంగ్రెస్‌లోనే చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. పొంగులేటి, జూపల్లి ఇరువురు కలిసి ఒకే పార్టీలోకి వెళ్లే విషయంపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఖమ్మంలో జరుగుతున్న పొంగులేటి Jupalli left for Ponguleti Atmiya Sabha with his followersఆత్మీయ సమావేశంలో పాల్గొనడానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 40 కి పైగా వాహనాలలో తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు. ఆ సభలో అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పొంగులేటి, జూపల్లి ఎండగట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభల అనంతరం ఇరువురు నేతలు ఏ పార్టీలో చేరుతారు అన్న అంశంపై స్పష్టత రానున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News