కవిత మాజీ ఆడిటర్ బెయిల్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్.. ఉత్కంఠగా మారిన కోర్టు నిర్ణయం!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

Update: 2023-03-01 14:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌పై రేపు కోర్టు కీలక నిర్ణయం వెలువరించబోతోంది. బుచ్చిబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు చెబుతామని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో బుచ్చిబాబును ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్ట్ చేసింది. అతడిని ప్రశ్నించేందుకు ఈడీ ఇటీవలే అనుమతి పొందింది. కాగా ఈ కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్‌తో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ సీఎం కుమార్తె కవితకు కొంతకాలం ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News