Jishnu Dev Varma: కులగణనలో గవర్నర్ వివరాల సేకరణే ప్రథమం

తెలంగాణ(Telangana)లో సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక(social), ఆర్థిక(Economic), విద్య(Eduvation), ఉపాధి(Employment), రాజకీయ(Political), కుల సర్వే(Caste survey)లో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.

Update: 2024-11-09 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక(social), ఆర్థిక(Economic), విద్య(Eduvation), ఉపాధి(Employment), రాజకీయ(Political), కుల సర్వే(Caste survey)లో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు(Enumerators) ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముందుగా ఉదయం రాజ్‌భవన్‌(Raj Bhavan)లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ(Governor Jishnu Dev Varma) వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ కి వెళ్లిన అధికారులు.. గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ కార్యాలయంలో ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ తెలిపిన వివరాలను ప్రభుత్వ ఫారమ్ లో సమగ్రంగా నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ ​కుమార్ సుల్తానియా(Planning Department Principal Secretary Sandeep Kumar Sultania), గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం(Governor Principal Secretary Burra Venkatesham), జిల్లా కలెక్టర్​ అనుదీప్(District Collector Anudeep) తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని ఈ నెల 6 న ప్రారంభించారు. ఇందులో ఎన్యూమరేటర్లు మూడు రోజుల పాటు తాము వివరాలు సేకరించాల్సిన గృహాలపై స్టిక్కర్లు వేశారు. ఈ రోజు నుంచి ఆయా గృహాల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. 

Tags:    

Similar News