Jaggareddy: తిరుమల లడ్డూ వివాదం బీజేపీ కుట్రే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్స్‌తో సహా సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Update: 2024-09-26 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్స్‌తో సహా సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం (Jagan Government) వ్యవహరించిందంటూ శ్రీవారి భక్తులు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, రాజీకీయ నాయకులు కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల (Tirumala) లడ్డూ వివాదం పక్కా బీజేపీ (BJP) కుట్రేనని ఆరోపించారు. కమలనాథుల డైరెక్షన్‌లోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్క్రీప్ట్‌ను అమలు చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ, వైసీపీ (YCP)కి మధ్య గొడవ పెట్టి మధ్యలో బీజేపీ (BJP) సీట్లను పెంచుకునేందుకు ప్లాన్ వేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా (Special Status) సాధించడం, పోలవరం (Polavaram) నిర్మాణం పూర్తి చేయడం కేవలం కాంగ్రెస్ (Congress) పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.


Similar News