‘సార్.. న్యాయం చేయండి’.. సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ కీలక రిక్వెస్ట్

గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్ కింద పరిగణిస్తున్నారని, జ్యూడిషియరీ, రైల్వే, బ్యాంకులను

Update: 2024-06-23 15:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్ కింద పరిగణిస్తున్నారని, జ్యూడిషియరీ, రైల్వే, బ్యాంకులను కూడా పరిగణలోకి తీసుకోవాలని గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ మామిడి నారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ బదిలీల తరహాలోనే గురుకులాలకూ అవకాశం ఇవ్వాలన్నారు. జీవో 317 కేటాయింపులలో అన్ని స్పోజ్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్‌తో పాటు పబ్లిక్ సెక్టర్లకూ ఛాన్స్ ఇవ్వాలన్నారు. అన్ని మెడికల్ కేసులను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, కే జనార్ధన్, నరసింహులు గౌడ్, గణేష్​ తదితరులు ఉన్నారు.


Similar News