మరో ఉద్యమానికి నడుం బిగించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

తమ డిమాండ్ల సాధనకు చేయబోయే కార్యాచరణను ప్రకటించింది తెలంగాణ ఉద్యోగ జేఏసీ(Telangana Employees JAC).

Update: 2024-10-22 11:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమ డిమాండ్ల సాధనకు చేయబోయే కార్యాచరణను ప్రకటించింది తెలంగాణ ఉద్యోగ జేఏసీ(Telangana Employees JAC). తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలని.. ఉద్యోగుల పెండింగ్ డీఏలు, బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. వాటి సాధనకు ఏమేం చేయాలో కార్యచరణ వెల్లడించారు. ఈనెల 26న జరగనున్న కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగుల డిమాండ్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. 28న సీఎం రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతి కుమారికి తమ కార్యాచరణ లేఖలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం నవంబర్ 2న జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత ప్రజాప్రతినిధులకు లేఖలు ఇస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదని, కొత్త పీఆర్సీ అమలు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టిందని తెలిపింది. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అయితే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామని ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు. కేబినెట్ మీటింగ్ లో సీఎం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని తెలియ జేశారు.     


Similar News