Jabardasth Ramprasad: జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్! ఔటర్‌పై కారు ప్రమాదం
జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్ (Jabardasth Ramprasad) రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. గురువారం తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. షూటింగ్‌కు వెళ్తున్న క్రమంలో ఔటర్‌పై సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో ముందున్న కారును రామ్‌ప్రసాద్ కారు ఢీ కొట్టడం జరిగింది.
ప్రమాదంలో రామ్‌ప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతన్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.