దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ దాదాపుగా ముగింపు దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరో వారం రోజుల్లో సిట్ అధికారులు విచారణలో వెల్లడైన అంశాలతో సమగ్ర నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం. కాగా, ప్రశ్నాపత్రాల లీకేజీపై ఎఫ్ఐఆర్జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్అధికారులు నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నట్టుగా తెలియవచ్చింది. బిల్డింగ్టౌన్ప్లానింగ్ఓవర్సీస్పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా అనుమానాలు రావటంతో గత నెల 11న బోర్డులో అసిస్టెంట్సెక్రటరీగా పనిచేస్తున్న ఎస్.సత్యనారాయణ బేగంబజార్పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కేసులు నమోదు చేసిన బేగంబజార్పోలీసులు సెంట్రల్జోన్టాస్క్ ఫోర్స్పోలీసులతో కలిసి దర్యాప్తు జరుపగా ఏఈఈ సివిల్, జనరల్స్టడీస్పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్టుగా వెల్లడైంది. బోర్డులో అసిస్టెంట్సెక్షన్ఆఫీసర్హోదాలో సెక్రటరీ అనితా రాంచంద్రన్పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ఔట్‌సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఈ ప్రశ్నాపత్రాలను తస్కరించినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రశ్నాపత్రాలను దొంగిలించినట్టు ఒప్పుకున్కన్నారు.
కాన్ఫిడెన్షియల్రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్‌కు సంబంధించిన పాస్వర్డులు, ఐపీ అడ్రస్‌లు సంగ్రహించి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చినట్టు ప్రవీణ్విచారణలో వెల్లడించాడు. వీటి సహాయంతో రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్‌నుంచి ప్రశ్నాపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌చేసి ఇచ్చినట్టు చెప్పాడు. వీటిని తాను మూడేళ్లుగా పరిచయం ఉన్న గురుకుల టీచర్రేణుకకు పది లక్షల రూపాయలకు తీసుకుని ఇచ్చినట్టు వెల్లడించాడు.
ఈ క్రమంలో పోలీసులు రేణుకను కూడా అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాలను తన భర్త లద్యావత్డాక్యాకు ఇచ్చినట్టుగా ఆమె చెప్పటంతో అతన్ని కూడా కటకటాల వెనక్కి పంపించారు. ఆ తరువాత నిందితులను జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు ప్రశాంత్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాక్యాలతోపాటు మొత్తం పదిహేనుమందిని ఈ కేసులో దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రశ్నాపత్రాలు కొన్నవారు ఉన్నారు.
గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కూడా..
అరెస్టు చేసిన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను నిశితంగా జరిపిన విచారణలో ఈ ఇద్దరు కలిసి గత సంవత్సరం అక్టోబరులో జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష ప్రశ్నాపత్రాన్ని కూడా బోర్డు నుంచి తస్కరించినట్టుగా వెల్లడైంది. ఈ పరిణామం తీవ్ర కలకలం సృష్టించింది. గ్రూప్1 ప్రిలిమ్స్ప్రశ్నాపత్రం లీకైనట్టుగా సిట్అధికారులు నివేదిక ఇవ్వటం, ఆ వెంటనే ఈ పరీక్షతోపాటు నిర్వహించాల్సి ఉన్న మరికొన్ని పరీక్షలను బోర్డు రద్దు చేయటం వెంటవెంటనే జరిగిపోయాయి. కాగా, విచారణలో గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష ప్రశ్నాపత్రం ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, బోర్డు ఉద్యోగులైన షమీమ్, రమేశ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేష్‌కు మాత్రమే అందినట్టుగా సిట్విచారణలో నిర్ధారణ అయ్యింది.
న్యూజీలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష రాసినట్టుగా తేలింది. ఈ అయిదుగురికి తప్పితే ఈ ప్రశ్నాపత్రం బయటివారెవ్వరికీ లీక్కాలేదని స్పష్టమైంది. కాగా, బోర్డులో పరీక్షల ప్రశ్నాపత్రాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఛైర్మన్సంరక్షణలో ఉండాల్సిన కంప్యూటర్ఉండే కాన్ఫిడెన్షియల్రూం ఇంఛార్జీ బాధ్యతలను శంకర్‌లక్ష్మికి ఎలా అప్పగించారు? సెక్రటరీ వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్, బోర్డు సభ్యుడు లింగారెడ్డి వద్ద పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్లను హ్యాక్‌చేసి ప్రశ్నాపత్రాలను తస్కరించినా ఎందుకు గుర్తించలేకపోయారు? అన్న అంశాలపై సిట్అధికారులు తాజాగా అనితా రాంచంద్రన్, లింగారెడ్డి నుంచి సేకరించారు.
దర్యాప్తులో పాలు పంచుకుంటున్న ఓ అధికారితో మాట్లాడగా లీకేజీ కేసులో విచారణ దాదాపుగా ముగింపు దశకు చేరుకుందని చెప్పారు. ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలే బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష ప్రశ్నాపత్రం వెళ్లలేదని నిర్ధారణ అయ్యిందన్నారు. బోర్డు ఛైర్మన్‌తోపాటు ఇతర సభ్యుల నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. ఈ అన్ని అంశాలతో నివేదికను రూపొందించి సీల్డ్కవర్లో న్యాయస్థానానికి ఇవ్వనున్నట్టు చెప్పారు.
విచారణ మొదలు పెట్టనున్న ఈడీ..
ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలో పెద్దమొత్తాల్లో డబ్బులు చేతులు మారినట్టుగా ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల ఈడీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ఈ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా అందులో పేర్కొన్నారు. దీంట్లో మనీలాండరింగ్చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ అధికారులను కోరారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీపై ఎఫ్ఐఆర్జారీ చేశారు. అయితే, శని, ఆదివారాలు సెలవు కావటంతో విచారణను ప్రారంభించలేదు.
నేడు సిట్కార్యాలయానికి వెళ్లి ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన అన్ని వివరాలను ఈడీ అధికారులు తీసుకోనున్నట్టు సమాచారం. ఆ తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నట్టు తెలిసింది. దీనిపై సిట్వర్గాలతో మాట్లాడగా మా విచారణలో తేలిన అంశాలతో కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పాయి. ఈడీ దర్యాప్తు సెపరేట్‌గా జరుగుతుందని తెలిపాయి. వాళ్ల దర్యాప్తులో వెల్లడైన వివరాలతో వాళ్లు రిపోర్టును సిద్ధం చేసి కోర్టుకు ఇస్తారని వివరించాయి.