బీజేపీలోకి మరో కాంగ్రెస్ కీలక నేత.. తెరవెనుక చక్రం తిప్పుతోన్న జేజమ్మ..?

కర్ణాటకలో ఓటమి, నాయకత్వ మార్పుపై ప్రచారంతో డీలా పడిన కేడర్‌లో జోష్ నింపడానికి బీజేపీ జాయినింగ్స్‌పై దృష్టి పెట్టింది.

Update: 2023-06-13 03:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో ఓటమి, నాయకత్వ మార్పుపై ప్రచారంతో డీలా పడిన కేడర్‌లో జోష్ నింపడానికి బీజేపీ జాయినింగ్స్‌పై దృష్టి పెట్టింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా మాగం రంగారెడ్డికి పేరుంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాగం రంగారెడ్డి చేరిక కూడా దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలిసింది.

కాంగ్రెస్ నేతలకు జేజమ్మ గాలం

తనకున్న పాత పరిచయాలతో కాంగ్రెస్ నేతలకు డీకే అరుణ గాలం వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తానని గతంలో ఆమె అనేక సార్లు చెప్పారు. అందుకనుగుణంగానే జాయినింగ్స్‌పై ఇప్పుడు పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా పార్టీ ప్రెసిడెంట్‌గా డీకే అరుణ పేరును జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నదని ప్రచారం జరుగుతుండడం, కాంగ్రెస్ నేతలతో జేజమ్మ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

అయితే ఆమె ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ సారి ఎమ్మెల్యే బరిలో ఉండాలని భావిస్తున్నారు. అందుకే గద్వాల సెగ్మెంట్‌కే పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి తన బలాన్ని పెంచుకుంటున్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్లకు గాలం వేస్తున్నారు. అయితే డీకే అరుణ ఆపరేషన్ ఆకర్ష్ స్ట్రాటజీ ఫలిస్తుందా? సీక్రెట్ మీటింగ్స్ సక్సెస్ అయి నేతలు కాషాయతీర్థం పుచ్చుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.

Also Read:    వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో రాకేష్‌రెడ్డి దూకుడు..! 


Similar News