సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులకు కారణమిదే..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించిన పుష్ప సినిమా నుంచి వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్‌కి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుపుతున్నట్లు సమాచారం. సుకుమార్‌తో సహా మరో నిర్మాత కార్యాలయాల్లోను ఐటీ తనిఖీలు నిర్వహిస్తుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులోను ఇవాళ ఐటీ సోదాలు చేస్తోంది. సంస్థ డైరెక్టర్లు నవీన్, రవిశంకర్ ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకున్నారని, వాటికి సంబంధించి దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప షూటింగ్ రద్దైంది. కాగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కాంబోలో పుష్ప- 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Read more:
Chandramukhi :నోరు జారిన లారెన్స్.. చంద్రముఖిపై కీలక అప్డేట్ రివీల్