సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ భేటీ.. కీలక ఒప్పందం
సీఎం రేవంత్ రెడ్డితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ భేటీ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ భేటీ అయ్యారు. బుధవారం సచివాలయానికి వచ్చిన సోమనాథ్ సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాత్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతకు ముందు సచివాలయానికి వచ్చిన ఇస్రో చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇస్రో అధికారులు ఉన్నారు.