వీహెచ్‌ను పక్కన పెట్టారా? ప్రెస్‌మీట్స్ కవర్ చేయొద్దని పెద్దల ఆర్డర్స్!

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు ప్రెస్‌మీట్‌లు కవర్ చేయవద్దని పార్టీ పెద్దలు గాంధీభవన్ సిబ్బందికి ఆర్డర్ వేసినట్లు గుసగులు వినిపిస్తున్నాయి.

Update: 2024-03-24 07:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు ప్రెస్‌మీట్‌లు కవర్ చేయవద్దని పార్టీ పెద్దలు గాంధీభవన్ సిబ్బందికి ఆర్డర్ వేసినట్లు గుసగులు వినిపిస్తున్నాయి. వీహెచ్ ప్రెస్‌మీట‌లకు లైవ్ లింకులు, సమాచారం గాంధీ భవన్ సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతల ప్రెస్‌మీట్లు లైవ్ లింక్‌లు ఇచ్చేది.. కానీ వీహెచ్ లైవ్ లింక్ తప్ప.. మిగిత నేతల ప్రెస్‌మీట్ లింక్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీహెచ్ మాట్లాడుతున్నారని, అతని ప్రెస్‌మీట్లు కవర్ చేయొద్దని పార్టీ పెద్దల ఆర్డర్ వేసినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.

వీహెచ్‌ను పక్కన పెట్టారా?

సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి టైమ్ ఇవ్వడంలేదని నిన్న వీహెచ్ ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు. సీఎం బీఆర్ఎస్ నేతల దగ్గరకు వెళ్లి.. వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇస్తుంటే.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, వీ. హనుమంతరావు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించారు. తనను పార్టీలో పక్కన పెట్టారని వీహెచ్ ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన ప్రెస్‌మీట్లు కవర్ చేయవద్దని సిబ్బందికి ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News