T Congress : ఇదేం న్యాయం కేసీఆర్? న్యాయం గెలిచిందా? కవిత బెయిల్‌పై టీ కాంగ్రెస్ ప్రశ్నలు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-08-27 15:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ల‌భించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. న్యాయం గెలిచిందని, ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని, రాజకీయ ప్రేరేపిత కేసులో ఆఖరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది. ఇదేం న్యాయం కేసీఆర్ అంటూ ట్వీట్ చేసింది.

న్యాయం గెలిచిందా? మద్యం పాలసీ స్కామ్‌లో జైలుకు వెళ్లినందుకుకా? తెలంగాణ సమాజం తలదించుకునేలా చేసినందుకా? ఉద్యమం పేరుతో దోచుకుని, అవినీతి కేసులో దొరికినందుకా? ఢిల్లీలో బీజేపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకా? అని తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నలు వేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరం గురించి మీరే చెప్పాలని ఓ నెటిజన్ సెటైర్లు వేశాడు. ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిది న్యాయం అయినప్పుడు మిగతావి న్యాయం కావా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. క‌విత వెంట ఆమె భ‌ర్త అనిల్ కుమార్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రానున్నారు.బుధవారం ఉద‌యం బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే చాన్స్ ఉంది.

 


Similar News