ఇలా అమాయకుల ప్రాణాలు బలి తీయడం సమంజసమేనా?.. వీసీ సజ్జనార్ ట్వీట్

రోడ్లపై వాహనాలను ఇష్టారీతిన నడుపుతూ..అమాయకుల ప్రాణాలు బలి తీయడం ఎంతవరకు సమంజసం అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

Update: 2024-07-02 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లపై వాహనాలను ఇష్టారీతిన నడుపుతూ..అమాయకుల ప్రాణాలు బలి తీయడం ఎంతవరకు సమంజసం అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రమాదానికి సంబందించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్దుడిని కారు ఢీ కొట్టింది. దీంతో ఆ వృద్దుడు రోడ్డు ప్రక్కన ఎగిరిపడ్డాడు. అయినా కారు ఓ నిమిషం ఆగి, మళ్లీ ఏమి పట్టనట్టు నిర్లక్ష్యంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైందని, కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారని అన్నారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారని తెలియజేశారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ.. అమాయకపు ప్రాణాలను తీయడం ఎంత వరకు సమంజసం!? అని వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు 

Similar News