ఆ శాఖలో ఆయనే కింగ్ మేకర్?

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు.

Update: 2023-03-04 02:47 GMT

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు. తమ ఉద్యోగ రిత్యా పనుల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ పని జరగాలంటే డీఈఓను కలిస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ నారాయణపేటలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆ కార్యాలయంలో పాతుకుపోయిన ఓ కింది స్థాయి అధికారి కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ మొత్తాన్ని ముట్టచెప్తే తప్పా కాగితం ముందుకు కదలని పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎంతటి వారైనా తమ పనైందంటే చాలు సాయంత్రానికి దావత్ ఇవ్వాల్సిందే. ఇలా చాలా వరకు ఆర్డర్ కాపీలు కార్యాలయంలో కాకుండా బార్ షాపులోనే చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

దిశ ప్రతినిధి, నారాయణపేట : విద్యాబుద్ధులు చెప్పి.. భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు తమ పనుల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ పని జరగాలంటే డీఈఓను కలిస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ నారాయణపేటలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా విద్యాశాఖ కార్యాలయంలో పాతుకుపోయిన ఓ కింది స్థాయి అధికారి కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ మొత్తాన్ని ముట్టచెప్తే తప్పా కాగితం ముందుకు కదలని పరిస్థితి నెలకొందని టీచర్లు వాపోతున్నారు. ఇక ఎంతటి వారైనా తమ పని అయిపోయింది అంటే సాయంత్రానికి దావత్ ఇవ్వాల్సిందే. చాలా వరకు ఆర్డర్ కాపీలు కార్యాలయంలో కాకుండా బార్ షాపులోనే చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆయన పేరు వింటేనే కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయమే.

కోపిష్టిగా పేరున్న ఆయన కార్యాలయంలోని అధికారులపై, అక్కడికి వచ్చే ఉపాధ్యాయులపై నోరు పారేసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో ఆయన జోలికి పోవాలంటే అందరూ జడుసుకుంటారు. సంఘ బాధ్యులైనా సరే ఆయనకు సలాం కొట్టాల్సిందే. ఇక సమయపాలన విషయంలో ఆయనకు నచ్చినప్పుడే రావడం. ఇష్టం వచ్చినప్పుడు పోవడం చేస్తుంటాడు. బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఆ సమయానికి వచ్చి వేలిముద్ర వేసి వెళ్లడం ఆయనకు అలవాటే. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి అయనపై విచారణ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News