డైరెక్టర్ క్రిష్ అరెస్ట్ తప్పదా?

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నిన్న సైబరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

Update: 2024-03-02 07:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నిన్న సైబరాబాద్ పోలీసుల ముందు దాదాపు 4 గంటల పాటు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. నేడే ఆ బ్లడ్, మూత్ర శాంపిల్స్ రిజల్ట్స్ రానున్నాయి. నిజానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును నిన్న ఆశ్రయిచడంపై ఆయనపై ఆనుమానాలు ఎక్కువ అయ్యాయి.

పాజిటివ్ వస్తే అరెస్టే..!

శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటీవ్ వస్తే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ వస్తే మాత్రం మరోసారి టెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. కాగా, రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్‌నాథ్ రక్త నమూనాలు పాజిటీవ్‌గా రావడంతో ఈ కేసు కీలక పరిమాణంగా మారింది. హోటల్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండుకు అనుమతి లభించలేదు. మరోవైపు ఈ కేసులో పేర్లు ఉన్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. దీంతో విచారణకు రాని వారందరి ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, డ్రగ్స్ అనే మాట తెలంగాణలో వినపడోద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News