నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం.. ఓ ఫంక్షన్‌లో బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత పలకరింపులు

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఓ ఫక్షన్‌లో బండిసంజయ్, ఎమ్మెల్సీ కవిత ఇరువురు ఒకరినొకరు పలకరించుకున్నారు.

Update: 2023-05-31 09:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మరే రంగంలోనూ కనిపించని చిత్రవిచిత్రాలు రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తాయి. రాజకీయంలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అనేవారు ఎవరు ఉండరు. కోట్లాది మందిని విభజన చేసే రాజకీయ నేతలు.. సభ నుంచి బయటకు రాగానే భుజం భుజం రాసుకుపూసుకొని మాట్లాడుకోవటం చూస్తూనే ఉంటాం. అలా బద్ద ప్రత్యర్థులు ఒకే ఇంట్లో ఎదురైతే ఆ సీన్ ఎలా ఉంటుంది.

తాజాగా అలాంటి రేర్ సీన్ ఒకటి నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీనరసయ్య గృహప్రవేశం సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేశారు. ఈ వేడుకలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బీజేపీ నేతలను ఎమ్మెల్సీ కవిత పలకరించగా.. కవిత రాగానే ఆమెకు నమస్కారం చేస్తూ బండి సంజయ్ పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిత్యం తిట్టుకునే ప్రత్యర్థులను ఒకేచోట చూసిన వారంతా అవాక్కవుతున్నారు.

Read more

సీఎం కేసీఆర్‌కు కామ్రేడ్ల టెన్షన్! పొత్తుపై నోరు విప్పడానికి జంకు!

Tags:    

Similar News

టైగర్స్ @ 42..