ఎంపీగా పోటీ చేసి తీరుతా.. లాస్ట్ టైం అన్యాయమే.. కాంగ్రెస్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు తన మనసులో మాట చెప్పారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-02-26 10:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు తన మనసులో మాట చెప్పారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నానని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని స్పష్టంచేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని అన్నారు. పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు.

కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్ అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లాస్ట్ టైం కూడా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. మోడీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్లడానికి టైం లేదని విమర్శించారు. ఏం ఉద్దరించారని ఆయన సంకల్ప యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు.. గుడులు మీ అయ్య జాగీర్లా? అని మండిపడ్డారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..