ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్.. పెద్ద తరగతి గదులు ఇంకా ఎన్నో సదుపాయాలు.. సీఎస్

రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Update: 2024-07-19 10:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం దార్శనికత మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది మొదలైనవి ఉండాలని, ఈ భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్‌ను వారంలోగా సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌కి నోడల్ ఆఫీసర్‌గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

49 రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 31 రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా, మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News